WTC Final: అజింక్య రహానెను ఇప్పుడే అలా పిలవలేం: సంజయ్‌ మంజ్రేకర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final)లో భారీ లక్ష్య ఛేదనకు భారత్‌ దిగింది. ఇవాళ చివరి రోజు 280 పరుగులు చేస్తే టీమ్‌ఇండియా విజయం సాధిస్తుంది. 

Published : 11 Jun 2023 15:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC Final) తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి.. ఇప్పుడు భారీ లక్ష్య ఛేదనలోనూ క్రీజ్‌లో ఉన్న అజింక్య రహానెపై (20*)  సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇదే క్రమంలో టెస్టు కెరీర్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని దాటాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే పాత్ర పోషిస్తాడనే పేరుంది.  అయితే, భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ మాత్రం ‘క్రైసిస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది టీమ్‌’ అని రహానెను  పిలవడం ఇప్పుడే తగదని వ్యాఖ్యానించాడు. ఇంకొన్ని ఇన్నింగ్స్‌ల్లో అతడి ప్రదర్శన చూడాల్సి ఉందన్నాడు. 

‘‘అజింక్య రహానెను ఇప్పుడే క్రైసిస్‌లో అత్యుత్తమ బ్యాటర్‌ అని పిలవలేం. మరికొన్ని ఇన్నింగ్స్‌లను చూడాలి. ప్రస్తుతం ఉన్న ఇలాంటి పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరిన సందర్భాలూ ఉన్నాయి. నూతన ఉత్సాహంతో మళ్లీ జట్టులోకి వచ్చిన కొత్త రహానె రాణిస్తాడని భావిస్తున్నా. టెస్టు బ్యాటర్ 2.0తో ఆడుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన తీరు అద్భుతం. తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమవుతాడు’’ అని మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని