Ruturaj Gaikwad: గోల్డ్‌ మెడల్‌ నెగ్గడమే మా కల: రుతురాజ్ గైక్వాడ్

యువకులతో కూడిన జట్టును ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. దానికి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా నియమించింది.

Published : 16 Jul 2023 13:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ రెండు రోజుల కిందట ప్రకటన చేసింది. ఆసియా క్రీడలకు (Asian Games) వెళ్లే టీమ్‌ఇండియాకు రుతురాజ్‌ నాయకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. క్రికెట్‌ మ్యాచ్‌లు మాత్రం సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి పోడియం వద్ద భారత జాతీయ గీతం వినిపించేలా చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని రుతురాజ్‌ తెలిపాడు. ఇదే తమ కలగా పేర్కొంటూ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. 

వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు

‘‘మా అందరి కల భారత్‌ను విజేతగా నిలబెట్టడం. స్వర్ణ పతకం నెగ్గి భారత్‌ అభిమానులకు పోడియం వద్ద జాతీయ గీతం వినిపించేలా చేయడమే మా ముందున్న లక్ష్యం. దాని కోసం సన్నద్ధమవుతాం. ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన క్రికెట్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తాం. గర్వంగా ఇంటికి తిరిగి వస్తాం. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనుండటం గర్వకారణంగా ఉంది. తప్పకుండా టీమ్ఇండియా గోల్డ్‌ మెడల్‌ తీసుకొస్తుంది. ఇలాంటి మెగా ఈవెంట్లను టీవీల్లో చూసేవాడిని. దేశం కోసం అథ్లెట్లు కష్టపడి పతకాలు సాధించేవారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పతకం తెస్తే ఇంతకంటే ప్రత్యేకమైన అనుభూతి ఉండదు. భారత్‌ జెర్సీతో ఆడటమే గర్వంగా ఉంటుంది. ఆసియా క్రీడలు వంటి మెగా ఈవెంట్‌లో జట్టుకు సారథిగా ఉండటం వ్యక్తిగతంగా మంచి అవకాశం లభించినట్లే. సహచరులతో కలిసి మనందరి కలను సాకారం చేస్తాం’’ అని రుతురాజ్‌ వెల్లడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని