Sachin tendulkar:ఈ నాలుగు జట్లు ప్రపంచకప్‌ రేసుగుర్రాలు: సచిన్‌

ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరే జట్లపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

Published : 21 Oct 2022 01:10 IST

దిల్లీ: ఆస్ట్రేలియా వంటి ప్రపంచ ఛాంపియన్‌ ఓ వైపు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ మరోవైపు.. ప్రపంచ పోరు సమీపిస్తున్న వేళ టీమ్‌ఇండియా అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్‌కు చేరే జట్లపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్‌ నాలుగు స్థానాల్లో ఉంటాయని తాను భావిస్తున్న దేశాల జాబితా పేర్కొన్నాడు. పోటీ ఉన్నప్పటికీ కప్పు మనదే కావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. 

‘‘ఈ పోరులో కచ్చితంగా టీమ్‌ఇండియానే ఛాంపియన్‌గా నిలవాలని నేను కోరుకుంటాను. కానీ భారత్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్లు సైతం సెమీ ఫైనల్స్‌కు చేరే టాప్‌ 4 జట్లలో ఉంటాయి. అదే సమయంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా గట్టి పోటీనిస్తాయి.  ఈ టోర్నీలో ట్రోఫీ గెలిచే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. భారత జట్టు అనుకున్నది సాధించి తీరుతుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను’’ అంటూ సచిన్‌ ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం పెద్దలోటేనని అయితే అతడి స్థానంలో షమీ రావడం విలువైన ఎంపికని ఈ మాజీ కెప్టెన్‌ తెలిపాడు. ఆసీస్‌ వేదికగా అక్టోబర్‌ 23న పాక్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు