CWG 2022 : వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో..

Updated : 03 Aug 2022 17:03 IST

(ఫొటో సోర్స్‌: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 163 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 192 కేజీలు... మొత్తం 355 కేజీలు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ రికార్డును నెలకొల్పడం విశేషం. దీంతో భారత్ పతకాల సంఖ్య 14కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. 

 జూడోలో 100 కేజీల విభాగంలో భారత ప్లేయర్‌ దీపక్‌ దేశ్వాల్ తన పోరాటం ముగించాడు. ఫిజీ జూడో ఆటగాడు తెవితా తకయవా చేతిలో ఓటమిపాలయ్యాడు. లాన్‌బౌల్స్‌ మూడో రౌండ్‌లో మహిళల పెయిర్స్ విభాగంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ 5-5తో నిలిచింది. ప్రస్తుతం ఐదు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లూ సమంగా నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని