
ఈ ‘యాపిల్’ ధర ₹7.5 లక్షలు
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ గ్యాడ్జెట్స్ అంటే వినియోగదారులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త డివైజ్ వస్తోందంటే చాలు.. ఎప్పుడు కొందామా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు వస్తున్న ఐ ఫోన్లు, మ్యాక్ గ్యాడ్జెట్ల గురించి అందరికీ తెలుసు. కానీ యాపిల్ మొదటి కంప్యూటర్ ఎప్పుడు తయారైందో తెలుసా. యాపిల్ మొదటి కంప్యూటర్ యాపిల్ 1ను స్టీవ్ వొజ్నియాక్ డిజైన్ చేశారు. దీని ఉత్పత్తిని 1976లో ప్రారంభించగా 1977 సెప్టెంబర్ 30న నిలిపేశారు. అంటే సరిగ్గా 43 సంవత్సరాల క్రితం అన్నమాట. దీనికి గుర్తుగా కేవియర్ సంస్థ... యాపిల్ 1 కంప్యూటర్ను గుర్తు చేస్తూ ఐఫోన్ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్ స్పెషల్ ఎడిషన్లు తయారు చేసింది. వీటికి యాపిల్ 1, యాపిల్ 1 లైట్ అని పేరు పెట్టింది.
ఈ మొబైల్స్ వెనక భాగంలో యాపిల్ కంప్యూటర్‌కు సంబంధించిన మదర్ బోర్డును అతికించారు. యాపిల్ 1 ఎడిషన్ ధర సుమారు 10,000 డాలర్లు (సుమారు ₹7.5 లక్షలు). యాపిల్ 1 లైట్ ధర 5,000 డాలర్లు (సుమారు ₹3.5 లక్షలు). మొదటి యాపిల్ కంప్యూటర్లు 200 మాత్రమే ఉత్పత్తి చేశారు. దీంతో తొమ్మిది యాపిల్ 1 ఎడిషన్ ఫోన్లు, 49 యాపిల్ 1 లైట్ ఫోన్లు కేవియర్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్ మొదలైంది. ఈ మొబైల్స్ కలప ఫినిషింగ్‌తో వస్తున్నాయి. యాపిల్ 1 ఎడిషన్‌లో టైటానియం గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. యాపిల్ 1 లైట్లో ఆ సదుపాయం ఉండదు. కేవలం కలప ఫినిషింగ్ మాత్రం ఉంటుంది. ఈ ఫోన్లపై ‘APPLE’ అనే చేతి రాత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.