FarFarOut: సుదూర మరుగుజ్జు గ్రహం

మన సౌర వ్యవస్థలో అన్నింటికన్నా దూరంగా ఉన్న ఖగోళ వస్తువేంటో తెలుసా? ఫార్‌ఫారవుట్‌. ఇదో మరుగుజ్జు గ్రహం. దూరానికి తగ్గట్టే పేరు పెట్టారు కదా. దీని అసలు పేరు 2018 ఏజీ37. ప్లూటో ఆవల  

Updated : 29 Jul 2021 16:29 IST

ఖగోళం

మన సౌర వ్యవస్థలో అన్నింటికన్నా దూరంగా ఉన్న ఖగోళ వస్తువేంటో తెలుసా? ఫార్‌ఫారవుట్‌. ఇదో మరుగుజ్జు గ్రహం. దూరానికి తగ్గట్టే పేరు పెట్టారు కదా. దీని అసలు పేరు 2018 ఏజీ37. ప్లూటో ఆవల సుదూరంగా ఉండొచ్చని భావిస్తున్న తొమ్మిదో గ్రహాన్ని అన్వేషించే క్రమంలో దీన్ని గుర్తించారు. ఇటీవలే ఈ మరుగుజ్జు గ్రహం ఉనికిని నిర్ధరించారు. అతి దూరంగా ఉండటం వల్ల ఫార్‌ఫారవుట్‌ అని ముద్దు పేరు పెట్టారు. ఇది సూర్యుడి నుంచి 132 ఆస్ట్రోనామికల్‌ యూనిట్ల దూరంలో ఉంది. సూర్యుడి నుంచి ప్లూటో దూరానికన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఇంతకీ ఒక ఆస్ట్రోనామికల్‌ యూనిట్‌ అంటే ఎంతో తెలుసా? భూమికి, సూర్యుడికి మధ్య ఉన్నంత దూరం. ఇది సుమారు 15కోట్ల కిలోమీటర్లకు సమానం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫార్‌ఫారవుట్‌ ఎంత దూరంలో ఉందో. ఇది ఒకసారి సూర్యుడిని చుట్టి రావటానికి 1,000 సంవత్సరాలు పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని