‘గూగుల్‌ ఫొటోస్‌’: ఫీచర్‌కు చందా వసూలు

అంతర్జాల ప్రపంచంలో గూగుల్‌ భాగమైపోయింది. ఏది కావాలన్నా గూగుల్‌ వెతకాల్సిందే. కార్యాలయం, వ్యక్తిగత అవసరాల కోసం Gmail జీమెయిల్‌ను విరివిగా..

Published : 15 Nov 2020 12:36 IST

త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్: అంతర్జాల ప్రపంచంలో గూగుల్‌ భాగమైపోయింది. ఏది కావాలన్నా గూగుల్‌ వెతకాల్సిందే. కార్యాలయం, వ్యక్తిగత అవసరాల కోసం Gmail‌ను విరివిగా వాడుతుంటాం.  ఫొటోలను సేవ్‌, షేర్‌ చేసుకునేందుకు Gmail ‘గూగుల్‌ ఫొటోస్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా అప్‌డేట్‌లో భాగంగా ‘గూగుల్‌ ఫొటోస్‌’ యూజర్ల నుంచి గూగుల్‌ చందా వసూలు చేయాలని యోచిస్తున్నట్లు ఎక్స్‌డీఏ నివేదిక పేర్కొంది. ‘గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌’ పేరుతో అదనపు ఫీచర్‌ను యాడ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.  

గూగుల్‌ వన్‌ మెంబర్‌తో కలిగే ప్రయోజనాలు..! 
* అదనపు ఎడిటింగ్‌ ఫీచర్స్‌ను పొందేందుకు వీలు కలుగుతుంది
* స్టోరేజీ సామర్థ్యం పెంచుకునే అవకాశం

నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్‌ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించిందని ఎక్స్‌డీఏ నివేదిక తెలిపింది. ‘కలర్‌ పాప్‌’ ఫీచర్‌ను గూగుల్‌ ఫొటోస్‌ ఇప్పటికే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గూగుల్‌ ఫొటోస్‌లో డెప్త్‌ ఇన్‌ఫర్మేషన్‌తో ఇమేజెస్‌ ఎడిటింగ్‌ చేసుకునేందుకు ‘కలర్‌ పాప్‌’ ఫీచర్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకునేందుకు ‘కలర్‌ పాప్‌’ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే డెప్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ లేకుండా ఎక్కువ ఫొటోల ఎడిటింగ్‌ కోసం కొంత సొమ్ము చెల్లించి ‘కలర్‌ పాప్‌’ ఫీచర్‌ను వినియోగించుకునేలా గూగుల్ అవకాశం కల్పించనుంది. ఇదే కాకుండా ఎడిటింగ్‌కు సంబంధించి అదనపు ఫీచర్లను కల్పించనుంది. ఈ అదనపు ఫీచర్లను పొందాలంటే దాదాపు రెండు డాలర్లు (రూ.150) వరకు చెల్లించాల్సి రావొచ్చని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఫీచర్స్‌ను కావాలనుకునే యూజర్లు చెల్లించవచ్చు. అవసరం లేదనుకునేవారికి ‘కలర్‌ పాప్‌’ను ఇప్పుడు వాడుకునే విధంగానే అవకాశాన్ని గూగుల్‌ కల్పించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని