10,00,00,000 అంతరిక్ష వ్యర్థాలు!

ఉపగ్రహ వ్యర్థాలతో అంతరిక్షం రోజురోజుకీ చెత్తకుప్పలా మారుతోంది. ప్రస్తుతం గోలికాయ, అంతకన్నా పెద్ద సైజు వ్యర్థాలు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా. అదే చిన్న సైజు వ్యర్థాల సంఖ్య 10కోట్లకు పైనే! వీటిల్లో ఇప్పటివరకు 27,000 వ్యర్థాలనే గుర్తించారు.

Published : 22 Sep 2021 01:13 IST

పగ్రహ వ్యర్థాలతో అంతరిక్షం రోజురోజుకీ చెత్తకుప్పలా మారుతోంది. ప్రస్తుతం గోలికాయ, అంతకన్నా పెద్ద సైజు వ్యర్థాలు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా. అదే చిన్న సైజు వ్యర్థాల సంఖ్య 10కోట్లకు పైనే! వీటిల్లో ఇప్పటివరకు 27,000 వ్యర్థాలనే గుర్తించారు. చూడటానికివి చిన్నవే అయినా ఉపగ్రహాలకు పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెడతాయి. నట్లు, బోల్టులు, గడ్డకట్టిన రాకెట్‌ ఇంధనం రేణువులు.. చివరికి రంగు పెచ్చులు సైతం భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రోబోటిక్‌ చేయికి రంధ్రం పడటానికి కారణం ఇవేనని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి వరకు 6,542 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుండగా.. వీటిల్లో చురుకుగా పనిచేసేవి సగమే. వచ్చే దశాబ్దంలో నాలుగింతలు ఎక్కువగా ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశముంది. జనవరిలో ఒక్క స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారానే 143 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. సౌలభ్యం మాట పక్కనపెడితే ఇవన్నీ మున్ముందు అంతరిక్ష వ్యర్థాలు పోగుపడటానికి దారితీసేవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని