సినిమా ఆపకుండానే..

నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో సినిమా చూస్తున్నారు. సినిమా మంచి ఉత్కంఠ దశలో ఉంది. అంతలో వేరే యాప్‌తో పని పడింది. సినిమా చూస్తూనే ఇతర యాప్‌ను వాడుకోవటమెలా? ఇందుకోసం పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ను...

Published : 22 Sep 2021 01:13 IST

నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో సినిమా చూస్తున్నారు. సినిమా మంచి ఉత్కంఠ దశలో ఉంది. అంతలో వేరే యాప్‌తో పని పడింది. సినిమా చూస్తూనే ఇతర యాప్‌ను వాడుకోవటమెలా? ఇందుకోసం పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ను ఎంచుకుంటే సరి. ఒకవైపు సినిమాను చూస్తూనే ఇతర పనులు కానిచ్చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనైతే సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ ప్రొటెక్షన్‌లోకి వెళ్లి.. స్పెషల్‌ యాప్‌ యాక్సెస్‌ మీద క్లిక్‌ చేసి, పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. అదే ఐఓఎస్‌ పరికరాల్లోనైతే జనరల్‌ సెటింగ్స్‌లోంచే ఈ ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా సినిమా దృశ్యాన్ని రీసైజ్‌ చేసుకోవచ్చు. స్క్రీన్‌ మీద ఎటైనా జరుపుకోవచ్చు. ఫ్లోటింగ్‌ విండోను మినిమైజ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని