ఖనిజాలు 10వేలకు పైనే!

ప్రస్తుతం 6వేల ఖనిజాలు ఉండొచ్చని భావిస్తున్నాం. అయితే వీటి సంఖ్య 10వేల కన్నా ఎక్కువే ఉండొచ్చని అమెరికాలోని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ సైన్స్‌ తాజా కేటలాగ్‌ పేర్కొంటోంది. ఖనిజాల్లోని అంతర్భాగాలనే కాదు.. అవి ఏర్పడిన తీరునూ ఇందులో పరిగణనలోకి తీసుకోవటం విశేషం.

Published : 06 Jul 2022 01:06 IST

ప్రస్తుతం 6వేల ఖనిజాలు ఉండొచ్చని భావిస్తున్నాం. అయితే వీటి సంఖ్య 10వేల కన్నా ఎక్కువే ఉండొచ్చని అమెరికాలోని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ సైన్స్‌ తాజా కేటలాగ్‌ పేర్కొంటోంది. ఖనిజాల్లోని అంతర్భాగాలనే కాదు.. అవి ఏర్పడిన తీరునూ ఇందులో పరిగణనలోకి తీసుకోవటం విశేషం. సాధారణంగా ఖనిజాలను వాటి ప్రత్యేక నిర్మాణం, రసాయనాలను బట్టి వర్గీకరణ చేస్తుంటారు. అయితే ఇవి ఏర్పడినప్పుడు భూమికి సంబంధించిన సమాచారాన్నీ నిక్షిప్తం చేసుకుంటాయి. అందువల్ల ఖనిజాలు ఎలా పుట్టుకొచ్చాయనేదీ ముఖ్యమేనన్నది పరిశోధకుల భావన. గ్రహాల పరిణామం, జీవుల పుట్టుకను అర్థం చేసుకోవటానికివి ఉపయోగపడతాయి. గ్రహశకలాలు ఢీకొట్టటం, భాష్పీకరణ, ఆక్సీకరణ వంటి 57 పద్ధతుల్లో ఖనిజాలు ఏర్పడతాయి. సూక్ష్మక్రిములు సైతం లోహాలను నిల్వ చేస్తుంటాయి. చాలా ఖనిజాలు ఇలాంటి పద్ధతుల్లోనే ఏర్పడినా కొన్ని మాత్రం విభిన్న మార్గాల్లో ఏర్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని