గేమింగ్‌ స్మార్ట్‌వాచ్‌

ఆన్‌లైన్‌ గేమ్‌ ప్రియుల కోసం దేశీయ మొబైల్‌ యాక్సెసరీస్‌ సంస్థ గిజ్‌మోర్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు గిజ్‌ఫిట్‌ అల్ట్రా. 500 నిట్స్‌ ప్రకాశంతో కూడిన 1.69 అంగుళాల హెచ్‌డీ కర్వ్‌ డిస్‌ప్లేతో ఎండలోనూ దృశ్యాలు బాగా కనిపించేలా తీర్చిదిద్దారు.

Updated : 12 Aug 2022 15:47 IST

న్‌లైన్‌ గేమ్‌ ప్రియుల కోసం దేశీయ మొబైల్‌ యాక్సెసరీస్‌ సంస్థ గిజ్‌మోర్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు గిజ్‌ఫిట్‌ అల్ట్రా. 500 నిట్స్‌ ప్రకాశంతో కూడిన 1.69 అంగుళాల హెచ్‌డీ కర్వ్‌ డిస్‌ప్లేతో ఎండలోనూ దృశ్యాలు బాగా కనిపించేలా తీర్చిదిద్దారు. బోలెడన్ని హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లు జోడించారు. 60కి పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్నాయి. ఆక్సిజన్‌ మోతాదులు, గుండె వేగాన్ని చూపించే ఫీచర్లతో పాటు మహిళల్లో నెలసరి తేదీని చెక్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఏఐ వాయిస్‌ సెర్చ్‌ ఎనేబుల్డ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌తో కూడిన ఇది అలెక్సా, యాపిల్‌ సిరి రెండింటినీ సపోర్ట్‌ చేస్తుంది. ఐపీ 68 వాటర్‌ఫ్రూఫ్‌ సర్టిఫికెట్‌ ఉండటం వల్ల వానలోకి వెళ్లినా తడవదు. ఇది కేవలం స్మార్ట్‌వాచ్‌ మాత్రమే కాదు, గేమ్స్‌ కూడా ఆడుకోవచ్చు. ముందుగానే మూడు గేమ్స్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని