చిటికెలో పీసీ లాక్‌

పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్‌ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది.

Published : 03 Jan 2024 00:10 IST

పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్‌ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. విండోస్‌లోనైతే విండోస్‌ కీ, ఎల్‌ మీటలను కలిపి ఒకేసారి నొక్కాలి. మ్యాక్‌లోనైతే కంట్రోల్‌, కమాండ్‌, క్యూ బటన్లను నొక్కాలి. అంతే. పీసీ చటుక్కున లాక్‌ అవుతుంది. కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ మీటలను నొక్కి.. పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే గానీ స్క్రీన్‌ కనిపించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని