గూగుల్‌ డాక్స్‌లో ఎమోజీల రియాక్షన్స్‌

ఇష్టమైన వాటిని ఎంచుకొని జొప్పించొచ్చు. ఇందుకోసం గూగుల్‌ ఎమోజీ రియాక్షన్స్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

Published : 07 Sep 2022 00:27 IST

గూగుల్‌ డాక్స్‌ వెబ్‌లో ఏదో రాస్తున్నారు. అందులో సందర్భానికి తగినట్టు ఎమోజీ జోడించాలని అనుకున్నారు. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. డాక్స్‌లో రాస్తున్న సమయంలోనే ఎమోజీలను సెర్చ్‌ చేసి, ఇష్టమైన వాటిని ఎంచుకొని జొప్పించొచ్చు. ఇందుకోసం గూగుల్‌ ఎమోజీ రియాక్షన్స్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. గూగుల్‌ డాక్స్‌లో టెక్స్‌ మధ్యలో అప్పటికప్పుడే నేరుగా ఎమోజీలను ఇన్‌సర్ట్‌ చేయటానికిది వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ వ్యక్తిగత గూగుల్‌ ఖాతాదారుల దగ్గర్నుంచి గూగుల్‌ వర్క్‌స్పేస్‌ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. దీనికి ఎలాంటి అడ్మిన్‌ కంట్రోల్‌ ఉండదు. ఎమోజీలను ఇన్‌సర్ట్‌ చేయటమూ తేలికే. టెక్స్ట్‌ మధ్యలో జీ అని టైప్‌ చేసి తర్వాత ఎమోజీ పేరును రాయొచ్చు. లేదూ @emoji అని టైప్‌ చేసి ఎమోజీలను సెర్చ్‌ చేసి, ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి కొందరికే ఈ ఫీచర్‌ను వాడుకోవటానికి అవకాశం కల్పించినప్పటికీ సెప్టెంబరు     చివరి నాటికి అందరికీ అందుబాటులోకి వస్తుంది. గూగుల్‌ డాక్స్‌ వెబ్‌లో ఎమోజీలను ఈ సంవత్సరం ఆరంభంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీన్ని అప్‌గ్రేడ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని