కోల్డ్‌ క్రీమ్‌ కథ

చలికాలం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది కోల్డ్‌ క్రీమ్‌. చర్మం పొడిబారకుండా చూడటానికిది ఎంతగానో ఉపయోగ పడుతుంది. నిజానికిది ఇప్పటిదేమీ కాదు. చర్మ సౌందర్యానికి ఉద్దేశించిదీ కాదు. క్రీస్తుపూర్వం 150లో రోమన్‌ వైద్యుడు గ్యాలెన్‌ నీరు, లక్క, ఆలివ్‌నూనెను కలిపి ప్రయోగాత్మక కోల్డ్‌ క్రీమ్‌ను రూపొందించారు.

Published : 02 Nov 2022 00:17 IST

లికాలం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది కోల్డ్‌ క్రీమ్‌. చర్మం పొడిబారకుండా చూడటానికిది ఎంతగానో ఉపయోగ పడుతుంది. నిజానికిది ఇప్పటిదేమీ కాదు. చర్మ సౌందర్యానికి ఉద్దేశించిదీ కాదు. క్రీస్తుపూర్వం 150లో రోమన్‌ వైద్యుడు గ్యాలెన్‌ నీరు, లక్క, ఆలివ్‌నూనెను కలిపి ప్రయోగాత్మక కోల్డ్‌ క్రీమ్‌ను రూపొందించారు. అప్పట్నుంచీ దీన్ని చర్మాన్ని శుభ్రం చేసుకోవటానికి వాడుతూ వచ్చారు. అనంతరం ఆలివ్‌ నూనెకు బదులు బాదం నూనెను వాడటం ఆరంభించారు. సువాసన కోసం గులాబీ నీరు వంటి వాటినీ జతచేశారు. కోల్డ్‌ క్రీమ్‌ను 1920లకు ముందు ఎక్కువగా రంగస్థల నటులు వాడేవారు. ముందుగా ముఖానికి క్రీమ్‌ రాసుకొని.. దానిపై పౌడర్‌ వంటివి అద్దుకునేవారు. నాటకం అయిపోయాక మేకప్‌ను తేలికగా తొలగించుకోవటానికిది బాగా ఉపయోగపడేది. అప్పట్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవటానికి సబ్బు, కోల్డ్‌ క్రీమ్‌ మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రీమ్‌ చర్మం పొడిబారకుండా చూస్తుంది కాబట్టి అంతా దీనికే ప్రాధాన్యం ఇచ్చేవారు. క్లెన్సర్ల వంటి ఇతరత్రా మేకప్‌ సామగ్రి అందుబాటులోకి రావటంతో కోల్డ్‌ క్రీమ్‌ వాడకం తగ్గుతూ వచ్చింది. కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. కొత్తరూపం సంతరించుకొని చర్మ సౌందర్యం కోసం ఉపయోగించుకోవటం మొదలైంది. ఇంతకీ దీన్ని కోల్డ్‌ క్రీమ్‌ అని ఎందుకంటారో తెలుసా? ఇది నూనె, నీటి మిశ్రమం కదా. చర్మం మీద రాసుకున్నప్పుడు నీరు ఆవిరవుతుంది. ఈ క్రమంలో చల్లటి భావన కలిగిస్తుంది. కాబట్టే కోల్డ్‌ క్రీమ్‌గా ప్రాచుర్యం పొందింది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని