గ్రామీణుల తోడు జుగల్‌బందీ

ఎన్నో ప్రభుత్వ పథకాలు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. వీటికి సంబంధించి ఎన్నెన్నో వెబ్‌సైట్లు. ఆన్‌లైన్‌లో వీటి గురించి వెతకటమంటే మాటలు కాదు.

Published : 31 May 2023 00:35 IST

న్నో ప్రభుత్వ పథకాలు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. వీటికి సంబంధించి ఎన్నెన్నో వెబ్‌సైట్లు. ఆన్‌లైన్‌లో వీటి గురించి వెతకటమంటే మాటలు కాదు. అక్షర జ్ఞానం లేనివారు, ఇంగ్లిష్‌ తెలియనివారికైతే మరింత కష్టం. పైగా మనదేశంలో ఎన్నో భాషలు. తెలిసిన భాషలో సమాచారాన్ని పొందటం కష్టమైన పనే. ఇలాంటి సమస్యలను అధిగమించటానికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ వినూత్న వాట్సప్‌ ఛాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు జుగల్‌బందీ. గ్రామీణులకు, రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని తేలికగా అందించటం దీని ఉద్దేశం. ఛాట్‌జీపీటీ మాదిరిగా అధునాతన కృత్రిమ మేధ పరిజ్ఞానంతో పనిచేసే ఇది వివిధ భారతీయ భాషల్లో మెరుగైన సమాధానాలు ఇస్తుంది. జుగల్‌బందీ ద్వారా అధీకృత వాట్సప్‌ నంబరుకు టెక్స్ట్‌ లేదా ఆడియో సందేశం పంపితే చాలు. ఏఐ4భారత్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ మోడల్‌ సాయంతో సందేశం ప్రతిని రాసుకుంటుంది. భాషిని అనే ట్రాన్స్‌లేషన్‌ మోడల్‌తో ఇంగ్లిష్‌లోకి అనువదించుకుంటుంది. అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సర్వీస్‌ మోడల్‌తో అడిగిన విషయాన్ని బట్టి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సంగ్రహిస్తుంది. సమాధానాన్ని గుర్తించిన తర్వాత దాన్ని ఆయా భాషల్లోకి అనువదించి, మాట రూపంలోకి మారుస్తుంది. చివరికి వాట్సప్‌ ద్వారా సందేశాన్ని అందిస్తుంది. తొలిదశలోనే ఇది మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండటం విశేషం. ప్రస్తుతం 22 అధికార భాషలను సపోర్టు చేస్తోంది. సుమారు 171 పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు