గూగుల్‌ సంగీత పరికరం

సంగీతానికి చింతకాయలు రాలకపోవచ్చు. కానీ పదాలకు సంగీతం రాలుతుంది! గూగుల్‌ పరిచయం చేసిన ఏఐ ఆధారిత సంగీత టూల్‌ దీనికి నిదర్శనం. దీని పేరు ఇన్‌స్ట్రుమెంట్‌ ప్లేగ్రౌండ్‌. పేరుకు తగ్గట్టుగానే వాద్యాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టిస్తుంది.

Published : 06 Dec 2023 00:10 IST

సంగీతానికి చింతకాయలు రాలకపోవచ్చు. కానీ పదాలకు సంగీతం రాలుతుంది! గూగుల్‌ పరిచయం చేసిన ఏఐ ఆధారిత సంగీత టూల్‌ దీనికి నిదర్శనం. దీని పేరు ఇన్‌స్ట్రుమెంట్‌ ప్లేగ్రౌండ్‌. పేరుకు తగ్గట్టుగానే వాద్యాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టిస్తుంది. దీనికి మనదేశానికి చెందిన వీణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాద్యాలతో శిక్షణ ఇచ్చారు. యూజర్లు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్‌ను అందిస్తే చాలు. దీనిలోని మ్యూజిక్‌ఎల్‌ఎం 20 సెకండ్లలోనే సంగీతం క్లిప్‌ను సృష్టించేస్తుంది. కావాలంటే సంతోషం, ప్రేమ, అనురాగం వంటి విశేషణాలనూ ప్రాంప్ట్‌నకు జోడించొచ్చు.

సౌండ్‌రాతో కృత్రిమ సంగీతం

కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్‌రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్‌ రహితమే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి అపహరించిన సంగీతమేమో అనే భయానికి తావులేదు.

గ్రామర్లీ అక్షర దోషాలకు చెల్లు

ఈమెయిల్‌, ఉత్తరాల వంటివి రాస్తున్నప్పుడు తప్పులు దొర్లకుండా ఉండటానికి గ్లామర్లీ ఏఐ సాయం తీసుకొని చూడండి.

పాడ్‌కాస్ట్‌ సేవకు పాడ్‌కాజిల్‌

ఇటీవల పాడ్‌కాస్ట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. గంభీరమైన అంశాల దగ్గరి నుంచి వినోద భరిత అంశాల వరకూ అన్నింటినీ పాడ్‌కాస్ట్‌లుగా రూపొందిస్తున్నారు. ఇందుకు పాడ్‌కాజిల్‌ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ టూల్స్‌తో కూడిన ఆడియో రికార్డింగ్‌, ఎడిటింగ్‌ వేదిక. స్పష్టమైన రికార్డింగ్స్‌ను సృష్టిస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ చేస్తుంది. రణగొణ ధ్వనులను తీసేస్తుంది. ఇందులో రిమోట్‌ ఇంటర్వ్యూ ఫీచర్‌ కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని