ఇక ఇన్‌స్టాలో నిమిషం వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియులకు శుభవార్త. ఇకపై 60 సెకండ్ల నిడివి గల వీడియోలనూ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికిది కొద్దిమందికే అందుబాటులో ఉన్నా త్వరలో అందరికీ వర్తింపజేయొచ్చని భావిస్తున్నారు.

Updated : 22 Dec 2021 04:13 IST

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియులకు శుభవార్త. ఇకపై 60 సెకండ్ల నిడివి గల వీడియోలనూ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికిది కొద్దిమందికే అందుబాటులో ఉన్నా త్వరలో అందరికీ వర్తింపజేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో 15 సెకండ్ల కన్నా పెద్ద వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే అవి ఆటోమేటిక్‌గా వివిధ స్టోరీలుగా విడిపోతాయి. కొత్త మార్పుతో నిమిషం నిడివి గల వీడియో మొత్తం ఒకే స్టోరీగా అప్‌లోడ్‌ అవుతుంది. స్టోరీస్‌ను పోస్ట్‌ చేయటానికి మెరుగుపరచిన ఇంటర్ఫేస్‌నూ పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇతర అకౌంట్లను ప్రస్తావించటానికి, పోస్ట్‌కు లొకేషన్‌ను జోడించటానికి వీలు కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను వాడేవారి సంఖ్య ఇటీవల 200 కోట్లు దాటిపోయిందట కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని