స్నాప్‌ఛాట్‌తో గేమ్స్‌

స్నాప్‌ఛాట్‌ యాప్‌లో గేమ్స్‌ ఆడుతున్నారా? ఒకప్పుడు ఆరు గేమ్స్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 50కి పెరిగింది. గేమ్స్‌కు అనువైన పరికరాల్లో వీటిని ఇతరులతో కలిసి ఆడుకోవచ్చు. తోడు దొరక్క పోతే ఒక్కరైనా ఆడుకోవచ్చు

Published : 12 Jan 2022 00:39 IST

స్నాప్‌ఛాట్‌ యాప్‌లో గేమ్స్‌ ఆడుతున్నారా? ఒకప్పుడు ఆరు గేమ్స్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 50కి పెరిగింది. గేమ్స్‌కు అనువైన పరికరాల్లో వీటిని ఇతరులతో కలిసి ఆడుకోవచ్చు. తోడు దొరక్క పోతే ఒక్కరైనా ఆడుకోవచ్చు. మరి వీటిని ఎలా ఆడుకోవాలో చూద్దామా?
* ముందుగా స్నాప్‌ఛాట్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి.
* కెమెరా మీద కుడి వైపునకు స్వైప్‌ చేసి, ఛాట్‌ విభాగంలోకి వెళ్లాలి.
* వ్యక్తిగత లేదా గ్రూప్‌ ఛాట్‌ను తెరవాలి. అడుగున కుడి వైపున కనిపించే రాకెట్‌ గుర్తు మీద తాకితే గేమ్స్‌, మినీస్‌ డ్రాయర్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.
* గేమ్‌ మీద నొక్కి ఇష్టమైన ఆటను ఆడుకోవటమే తరువాయి.
ఒక్కరే ఆడుకోవాలంటే..
* స్నాప్‌ఛాట్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
* తెర మీద పైన కనిపించే భూతద్దం ద్వారా సెర్చ్‌ గుర్తును నొక్కాలి.
కొత్త విండో మీద బెస్ట్‌ ఫ్రెండ్స్‌, రీసెంట్స్‌, క్విక్‌ యాడ్‌ అండ్‌ మోర్‌ ఆప్షన్లతో పాటు గేమ్స్‌ అండ్‌ మినీస్‌ విభాగమూ కనిపిస్తుంది.
ఇష్టమైన గేమ్‌ను ఎంచుకొని ఆడుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని