వీడియో కాల్‌ చేస్తున్నా సంగీతం వినొచ్చు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్‌ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్‌ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్‌ షేర్‌ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.

Published : 27 Dec 2023 00:13 IST

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్‌ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్‌ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్‌ షేర్‌ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు. కేవలం మాట్లాడుకోవటానికే కాకుండా వినోద భరిత అంశాలకూ వాట్సప్‌ను వాడుకోవటం ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్‌ వాట్సప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చగలదని భావిస్తున్నారు. మరోవైపు.. ‘మేనేజ్‌ ఎమోజీ రిప్లేస్‌మెంట్‌’ అనే ఫీచర్‌నూ బీటా టెస్టర్లకు వాట్సప్‌ అందుబాటులోకి తెచ్చింది. టెక్స్ట్‌ టు ఎమోజీ రిప్లేస్‌మెంట్‌ ఆప్షన్‌ను డిసేబుల్‌ చేసుకోవటానికిది తోడ్పడుతుంది. మెసేజ్‌ల విషయంలో యూజర్లకు ఎక్కువ నియంత్రణ కలిగుండటానికిది ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని