ఈ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా?

ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది.

Published : 27 Dec 2023 00:14 IST

ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 వర్షన్ల సామ్‌సంగ్‌ ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలంటూ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. ఈ ఫోన్లలో చాలా లోపాలను గుర్తించామని ప్రకటించింది. ఇవి పరికరం రక్షణ వ్యవస్థల కళ్లు గప్పి, రహస్య సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని పేర్కొంది. అలాగే 17.2 వర్షన్‌కు ముందరి కొన్ని యాపిల్‌ పరికరాల్లోనూ ఇలాంటి లోపాలు బయటపడటం గమనార్హం. వీటిని అత్యధిక ముప్పుతో కూడిన లోపాలుగానూ సీఈఆర్‌టీ వర్గీకరించింది. కాబట్టి వెంటనే ఫోన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని