చావులేని బ్యాక్టీరియా

భూగర్భంలోని సూక్ష్మక్రిముల్లో 45% వరకు వేడి రాళ్లలోనే ఉంటాయి. హైడ్రోకార్బన్లు, ఇతర రసాయన శక్తి మీదే మనుగడ సాగిస్తాయి. ఈ ‘లోతైన జీవావరణం’ మన భూమ్మీద అతిపెద్ద నివాసమైనప్పటికీ దీని గురించి తెలిసింది తక్కువే.

Updated : 31 Aug 2022 04:45 IST

భూగర్భంలోని సూక్ష్మక్రిముల్లో 45% వరకు వేడి రాళ్లలోనే ఉంటాయి. హైడ్రోకార్బన్లు, ఇతర రసాయన శక్తి మీదే మనుగడ సాగిస్తాయి. ఈ ‘లోతైన జీవావరణం’ మన భూమ్మీద అతిపెద్ద నివాసమైనప్పటికీ దీని గురించి తెలిసింది తక్కువే. దీనికి సంబంధించి కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గరీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని గుర్తించారు. వేడిని ఇష్టపడే, పెట్రోలియంను తిని జీవించే థెర్మోఫైలిస్‌ అనే బ్యాక్టీరియా సముద్రపు అడుగు భాగం లోతుల్లోంచి మహా సముద్రాల్లోకి వస్తోందని, చలికి ప్రభావితమైనప్పుడు నిద్రాణ స్థితిలోకి చేరుకుంటున్నట్టు కనుగొన్నారు. ఇలా ఇది సముద్ర ప్రవాహాలతో పాటు తిరుగుతూ.. ఇతర సుదూర చమురు నిల్వల్లోకి చేరుకున్న తర్వాత తిరిగి మేల్కొంటుండటం విశేషం. శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను ప్రయోగశాలలో 80 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద వేడి మరీ చేసి పరిశీలించారు. మామూలుగానైతే ఇతర సూక్ష్మజీవులు ఇంత వేడికి మాడి మసైపోతాయి. కానీ ఇది మాత్రం తిరిగి మేల్కొని, చురుకుదనం సంతరించుకోవటం ఆశ్చర్యకరం. ఇలాంటి బ్యాక్టీరియా ప్రతికూల వాతావరణంలో వేలాది సంవత్సరాలు.. ఆ మాటకొస్తే లక్షలాది సంవత్సరాలు మనుగడ సాగించగలదని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని