మందుల పరీక్షకు ఏఐ

కొత్త మందులను కనుగొన్నప్పుడు వాటి సామర్థ్యాన్ని అంచనా వేయటానికి బోలెడన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముందుగా కణాలు లేదా కణజాలాల మీద వాటి ప్రభావాన్ని పరిశీలిస్తుంటారు.

Updated : 30 Nov 2022 00:19 IST

కొత్త మందులను కనుగొన్నప్పుడు వాటి సామర్థ్యాన్ని అంచనా వేయటానికి బోలెడన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముందుగా కణాలు లేదా కణజాలాల మీద వాటి ప్రభావాన్ని పరిశీలిస్తుంటారు. సురక్షితమని తేలితే మనుషులపై పరీక్షిస్తుంటారు. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. సమయమూ ఎక్కువే పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) మీద దృష్టి సారించారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌కు చెందిన కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన కోడ్‌-ఏఈ నమూనానే దీనికి నిదర్శనం. ఇది కొత్త మందులను పరీక్షించటమే కాదు, మనుషుల్లో వాటి పనితీరు సామర్థ్యాన్నీ కచ్చితంగా అంచనా వేయగలదని చెబుతున్నారు. కొత్త మందులను త్వరగా పరీక్షించటానికిది ఎంతగానో ఉపయోగపడగలదని.. కణాలు లేదా కణజాల నమూనాలపై ఆదారపడటం తగ్గుతుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని