Google Play: ‘ప్లే యాప్స్‌ అండ్‌ గేమ్స్‌’కి పదేళ్లు.. ఈ యాప్స్‌ ప్రత్యేకమంటున్న గూగుల్‌!

ఆండ్రాయిడ్ (Android) యూజర్ల కోసం గూగుల్ (Google) 2012లో ప్లేను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా యాప్‌లను ఇందులోంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా పుట్టిన గూగుల్ ప్లేకి (Google Play) నేటితో పదేళ్లు పూర్తయ్యాయి.

Updated : 25 Jul 2022 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్ (Android) యూజర్ల కోసం గూగుల్ (Google) 2012లో ప్లేను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా యాప్‌లను ఇందులోంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా పుట్టిన గూగుల్ ప్లేకి (Google Play) నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం గతిని మార్చిన యాప్స్‌ అండ్‌ గేమ్స్‌ గురించి గూగుల్‌ తెలిపింది. ఆ వివరాలు మీ కోసం...

ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో యాప్స్‌ ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడ్డాయి. చిట్‌చాట్‌ సంభాషణల నుంచి షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ దాకా మన జీవితాల్లో ఎంతో సహాయపడ్డాయి. అంతేకాదు మన మెదడుకు పదును పెట్టేలా ఛాలెంజింగ్ గేమ్స్ ఎన్నో రూపుదిద్దుకున్నాయి. ప్లేలో యాప్స్‌ అండ్‌ గేమ్స్‌కు పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అత్యంత ఆదరణ కలిగిన యాప్‌ల జాబితాను మీతో పంచుకుంటున్నాం

- ప్లేస్టోర్‌లో గూగుల్‌ టీమ్‌

ఆండ్రాయిడ్ విడుదలైన తొలినాళ్లలో ఆండ్రాయిడ్‌ మార్కెట్‌, గూగుల్ మ్యూజిక్‌, గూగుల్ ఈబుక్‌స్టోర్‌, గూగుల్ మూవీస్‌ అని వేర్వేరుగా ఉండేవి. వాటన్నింటిని ప్లే కిందకు తీసుకొస్తూ ఈ యాప్‌ భాండాగారాన్ని గూగుల్ రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం గూగుల్‌ ప్లేలో ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల యాప్‌లు ఉన్నాయట. 

యాప్స్‌ ఏంటంటే?

  • అత్యధిక డౌన్‌లోడ్స్‌తో సోషల్‌ మీడియా కేటగిరిలో వాట్సాప్‌ (WhatsApp), షేర్‌చాట్‌ (Sharechat)లు ఉన్నాయి.
  • షాపింగ్‌ కోసం ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), అమెజాన్‌ (Amazon) ఉపయోగిస్తున్నారట.
  • ఎంటర్‌టైన్‌మెంట్‌ జాబితాలో ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ (MX Player), డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar), జియో సావన్‌ (Jio Saavn) ఉన్నాయి.
  • డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎం (Paytm), ఫోన్‌పే (Phonepe) ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారట.
  • కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ (Truecaller) కూడా పదేళ్ల కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్‌ల జాబితాలో ఉంది. 

గేమ్స్‌ లెక్క ఇదీ...

గేమింగ్‌ యాప్స్‌లో క్యాండీ క్రష్‌ (Candy Crush Saga) ఎక్కువ మంది ఫేవరెట్‌ గేమ్‌గా నిలిచింది. తర్వాత వరసగా క్లాష్‌ ఆఫ్‌ క్లాన్స్‌ (Clash of Clans), సబ్‌వే సర్ఫర్స్‌ (Subway Surfers), 8 బాల్‌ పూల్‌ (8 Ball Pool), లార్డ్స్‌ మొబైల్‌: టవర్‌ డిఫెన్స్‌ (Lords Mobile: Tower Defence), రియల్‌ క్రికెట్‌ 20 (Real Cricket 20), కాల్‌ ఆఫ్‌ డ్యూటీ: మొబైల్‌ (Call of Duty: Mobile), బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (Battlegrounds Mobile India), లూడో కింగ్‌ (Ludo King), వరల్డ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ 2 (World Cricket Championship 2) ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని