వన్‌ప్లస్‌ 8T ఇలానే ఉంటుందా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ 8 సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను తీసుకురానుంది. వన్‌ప్లస్‌ 8టీ పేరుతో త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ఆండ్రాయిడ్ 11 డెవలపర్‌ ప్రివ్యూ సదస్సులో విడుదల చేశారు....

Updated : 17 Oct 2022 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటన్న వన్‌ప్లస్‌ తన 8 సిరీస్‌లో కొత్త ఫోన్‌ త్వరలో అందుబాటులోకి  తీసుకురానుంది. వన్‌ప్లస్‌ 8టీ పేరుతో త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ఆండ్రాయిడ్ 11 డెవలపర్‌ ప్రివ్యూ సదస్సులో విడుదల చేశారు. ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదు. టెక్‌ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న  వన్‌ప్లస్ 8, 8 ప్రో మోడల్స్‌ కంటే ఇది భిన్నంగా ఉండబోతుందట.

ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్)‌తో పనిచేస్తుందట. ‌పంచ్ హోల్‌‌ కటౌట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌ /128 జీబీ ఇంటర్నెట్‌ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాను అమర్చినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ మార్కెట్లో సందడి చేయాల్సి ఉండగా, కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఫోన్‌ విడుదల ఆలస్యం అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఫోన్‌ విడుదల, ధర, ఇతర ఫీచర్స్‌ వివరాలకు సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు