వాట్సాప్ కొత్త పాలసీ.. వారికి మాత్రమేనట..!

ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటామని తెలిపింది. అలానే వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు...

Updated : 08 Jan 2021 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటామని తెలిపింది. అలానే వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది. వాట్సాప్‌ తాజా ప్రకటనతో యూజర్స్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెరదించినట్లయింది. అయితే దీనికి కొద్ది గంటల ముందు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వాట్సాప్ కొత్త పాలసీపై స్పందించారు. వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్ ఉపయోగించాలని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్ యాప్‌కి యూజర్స్‌ తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూజర్స్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే అందుకు సంబంధించిన విదివిధానాలతో కూడిన జాబితాను చూపిస్తూ ఒక పాప్-అప్‌ విండో ప్రత్యక్షమైంది. ఫిబ్రవరి 8 తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీపై యూజర్స్‌ అంగీకరించాలన్నది దాని సారాంశం. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపీ అడ్రస్‌ వంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటారని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై వాట్సాప్ స్పందిస్తూ కేవలం వాట్సాప్‌ బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌ బిజినెస్‌ ఖాతాలతో పంచుకుంటామని, వాటిని మాత్రమే వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగిస్తామని తెలిపింది. వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాదారులు కొత్త పాలసీని అంగీకరించినప్పటికి వారి వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని వెల్లడించింది. 

ఇవీ చదవండి..

కస్టమైజేషన్‌ ఫీచర్‌తో లావా కొత్త ఫోన్లు.. 

2021లో ఆన్‌లైన్ భద్రత.. ఏం చేయాలంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని