యూట్యూబ్‌లో పిల్లలపై నిఘా..
పెద్దలు వాడుతున్న గూగుల్ ఎకౌంట్లోనే పిల్లలు యాక్సెస్ చేయాల్సిన కంటెంట్‌ని మానిటర్ చేయొచ్చు.
మూడు రకాలుగా కంటెంట్ సెట్టింగ్స్..
రోజులో ఎక్కడ ఛాన్స్ దొరికినా.. టైమ్‌పాస్‌కి వాలిపోయేది యూట్యూబ్‌లోనే. అంతలా లెక్కకు మిక్కిలి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలైతే కావాల్సిన వాటిని వెతికి చూస్తారు.. మరి, పిల్లల సంగతి ఏంటి? ఏముందీ... ‘యూబ్యూబ్ కిడ్స్’ ఉందిగా అంటారా? అది బుజ్జాయిల కోసమే.. మరైతే, స్కూల్ వయసుకు వచ్చిన టీన్స్ సంగతేంటి? పేరెంట్స్ ఫోన్ తీసుకుని సరాసరి యూట్యూబ్‌లోనే విహరిస్తుంటారు. కరోనా తర్వాత ఇంటికే పరిమితం అవ్వడంతో ఇంకా ఎక్కువగా టీన్స్ యూట్యూబ్‌ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసీ.. తెలియని వయసులోని ఏం చూస్తున్నారు? ఎలాంటివి చూడాలి? ఏవి వారి కంటపడకూదు?.. లాంటి విషయాలపై కచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాలి. అందుకు తగిన నిఘా పెట్టాలి. అందుకే యూట్యూబ్ త్వరలోనే తల్లిదండ్రులకు ‘సూపర్వైజ్’ ఫీచర్‌ని ప్రవేశపెట్టనుంది. దీంతో పెద్దలు వాడుతున్న గూగుల్ ఎకౌంట్లోనే పిల్లలు యాక్సెస్ చేయాల్సిన కంటెంట్‌ని మానిటర్ చేయొచ్చు. మూడు రకాలుగా కంటెంట్ సెట్టింగ్స్‌ని పెట్టుకునే వెసులుబాటు కల్పించనుంది. అదెలాగంటే..
ఒకటి.. ‘ఎక్స్ప్లోర్’
ఇదో ప్రాథమిక విభాగం. అప్పుడప్పుడే బుజ్జాయిలు కాస్త పెద్దగా అయ్యి.. ఐదో తరగతి వచ్చిన పిల్లల కోసం అన్నమాట. అంటే.. ఫ్రెష్‌గా యూట్యూబ్ కిడ్స్ నుంచి యూట్యూబ్‌లోకి ఎంట్రీ పాస్ తీసుకునే వయసు పిల్లలు అన్నమాట. 9 ఏళ్లు పైబడిన పిల్లలకు తగిన సెట్టింగ్స్‌ని ‘ఎక్స్ప్లోర్’లో పొందొచ్చు. వ్లాగ్స్, ట్యుటోరియల్స్, గేమ్స్ వీడియోలు, మ్యూజిక్ క్లిప్స్, ఇతర ఎడ్యుకేషనల్ కంటెండ్ మాత్రమే కనిపించేలా చేయొచ్చు.
రెండోది.. ‘ఎక్స్ప్లోర్ మోర్’
హైసూల్క్ వయసు పిల్లలకు సరిపడే విభాగం ఇది. 13 ఏళ్లు పైబడిన పిల్లలకు తగిన కంటెంట్‌ని దీంట్లో కనిపించేలా చేయొచ్చు. లైవ్ స్ట్రీమింగ్స్ లాంటివి కూడా పిల్లలు వీక్షించే వెసులుబాటు కల్పించొచ్చు. పలు రంగాలకు సంబంధించిన ఇతర వీడియోలను కిడ్స్ బ్రౌజ్ చేసి చూడొచ్చు.
మూడోది.. ‘మోస్ట్ ఆఫ్ యూట్యూబ్’
పేరులో ఉన్నట్టుగానే యూట్యూబ్‌లో ఉన్న మొత్తం కంటెంట్‌ని యాక్సెస్ చేసి చూడొచ్చు. అయితే.. పిల్లల వయసు ఆధారంగా ఎలాంటి కంటెంట్‌ని చూడాలనేది నియంత్రించొచ్చు. సున్నితమైన విషయాల్ని వారి కంటపడకుండా జాగ్రత్తపడొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!