ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రెండోసారి కరోనా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రెండోసారి కరోనా సోకింది. గతేడాది సెప్టెంబరు 28న ఆయన తొలిసారి ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పుడు రెండోసారి పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

Updated : 24 Jan 2022 05:17 IST

ఈనాడు, దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రెండోసారి కరోనా సోకింది. గతేడాది సెప్టెంబరు 28న ఆయన తొలిసారి ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పుడు రెండోసారి పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. తొలిసారి సోకినప్పుడు ఆయనలో తేలిక పాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మరోవైపు వెంకయ్యనాయుడు వారం రోజులపాటు హైదరాబాద్‌లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని