Supreme Court: కొవిడ్‌ తగ్గింది కదా.. ఇక జైళ్లకు వెళ్లండి

కొవిడ్‌-19 మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో జైళ్ల రద్దీని తగ్గించేందుకు జారీ చేసిన తాత్కాలిక బెయిల్‌, పెరోల్‌ మీద బయట ఉన్న కేరళ ఖైదీలు.. రెండు వారాల్లోపు తిరిగి కారాగారాల్లో చేరాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ‘‘దాదాపు

Updated : 30 Apr 2022 09:38 IST

కేరళ ఖైదీలకు సుప్రీం ఆదేశం

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో జైళ్ల రద్దీని తగ్గించేందుకు జారీ చేసిన తాత్కాలిక బెయిల్‌, పెరోల్‌ మీద బయట ఉన్న కేరళ ఖైదీలు.. రెండు వారాల్లోపు తిరిగి కారాగారాల్లో చేరాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ‘‘దాదాపు దేశంలో సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చేశాయి. రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేదు. కొవిడ్‌-19 సోకుతుందన్న అవకాశంతో పెరోల్‌ ప్రయోజనం పొందిన ఖైదీల ఈ రోజు నుంచి రెండు వారాల వరకు కొనసాగవచ్చు. ఆ సమయంలోనే వారు తమ తమ జైళ్లకు రిపోర్టు చేయాలి’’ అని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహల ధర్మాసనం పేర్కొంది. ‘‘పెరోల్‌ మంజూరు చేశారని వచ్చే ఐదేళ్లు బయట ఉండమని కాదు కదా’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా 2021లో జైళ్ల రద్దీని తగ్గించేందుకు చాలా ఖైదీలకు దేశవ్యాప్తంగా బెయిల్‌, పెరోల్‌ మంజూరు చేశారు. కేరళలో పదేళ్లకు పైగా శిక్ష పడిన వారిని కూడా ఆ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని