2019కి తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలుగుచూసిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది.

Published : 14 Jun 2022 05:25 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలుగుచూసిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో డా.ఎం.పురుషోత్తమాచార్య ‘రహస్యభూతము’, వచన కవితా ప్రక్రియలో కృష్ణుడు ‘ఆకాశం కోల్పోయిన పక్షి’.., బాలసాహిత్యంలో ఎం.కృష్ణకుమారి ‘ఈ అడవి మాది’, కథానికా ప్రక్రియలో డా.సిద్దెంకి యాదగిరి ‘తప్ష’ అవార్డులకు ఎంపికయ్యాయి. నవలా ప్రక్రియలో రామచంద్రమౌళి ‘కాలనాళిక’, సాహిత్య విమర్శలో ప్రొ.జి.చెన్నకేశవరెడ్డి ‘అక్షర న్యాసం’, నాటక ప్రక్రియలో చిటిప్రోలు వెంకటరత్నం ‘అశోకపథం’.. అనువాదంలో టంకశాల అశోక్‌ ‘రాధాకృష్ణన్‌ జీవిత చరిత్ర’, వచన రచనల విభాగంలో జయరాజు ‘అవని’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో అనురాధ సుజలగంటి ‘అమ్మ బంగారు కల’ గ్రంథాలు సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యాయని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో వీటిని ప్రదానం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని