వ్యవసాయ భూమిలో కూలిన డ్రోన్‌

అదుపు తప్పి వ్యవసాయ భూమిలో డ్రోన్‌ కూలిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారంలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 05 Oct 2022 04:57 IST

గుండాల, న్యూస్‌టుడే: అదుపు తప్పి వ్యవసాయ భూమిలో డ్రోన్‌ కూలిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారంలో మంగళవారం చోటుచేసుకుంది. దొడ్డబోయిన ముత్యాలు, గుండ్లపల్లి రాంరెడ్డిలు పొలంలో పశువులను మేపుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో హెలికాప్టర్‌లా ఎగురుతూ వచ్చిన ఓ డ్రోన్‌ వారి సమీపంలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ‘‘ఈ డ్రోన్‌ 3 కి.మీ. దూరంలోని ఎంజేఆర్‌ వ్యవసాయ క్షేత్రం నుంచి ఎగురుతూ వచ్చింది. దీన్ని తీసుకుపోవడానికి వచ్చిన నిర్వాహకులను అడిగితే భారత రక్షణశాఖకు సంబంధించిన విషయం. దీనిపై ఎలాంటి సమాచారం చెప్పకూడదని బదులిచ్చారు’’ అని వారు చెప్పారు. డ్రోన్‌ ఎగరవేత, కూలిన ఘటనపై తమకు సమాచారం లేదని ఎస్సై బి.యాకయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని