హైకోర్టు న్యాయమూర్తుల జట్టు విజయం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు (జస్టిస్‌ లెవన్‌ జట్టు), అడ్వొకేట్‌ అసోసియేషన్‌ సభ్యుల (ప్రెసిడెంట్స్‌ లెవన్‌ జట్టు) మధ్య ఆదివారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది.

Published : 27 Mar 2023 03:18 IST

కార్ఖానా, న్యూస్‌టుడే: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు (జస్టిస్‌ లెవన్‌ జట్టు), అడ్వొకేట్‌ అసోసియేషన్‌ సభ్యుల (ప్రెసిడెంట్స్‌ లెవన్‌ జట్టు) మధ్య ఆదివారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన ప్రెసిడెంట్‌ లెవన్‌ కెప్టెన్‌ మల్లారెడ్డి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మ్యాచ్‌ను ప్రారంభించి.. కొద్దిసేపు క్రికెట్‌ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన జస్టిస్‌ నవీన్‌రావు సారథ్యంలోని జస్టిస్‌ లెవన్‌ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 118 పరుగులు చేసింది. 119 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ప్రెసిడెంట్స్‌ లెవన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో జస్టిస్‌ లెవన్‌ జట్టు ట్రోఫీని అందుకుంది. జస్టిస్‌ లెవన్‌ జట్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ సురేందర్‌రెడ్డి, జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ సూరేపల్లి నంద, జస్టిస్‌ సుధీర్‌కుమార్‌, జస్టిస్‌ కార్తీక్‌, జస్టిస్‌ నగేష్‌, జస్టిస్‌ విజయభాస్కర్‌రెడ్డి, జస్టిస్‌ తుకారాం, జస్టిస్‌ అనుపమచక్రవర్తి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని