ఏప్రిల్‌ 26 నుంచి తెలుగు వర్సిటీలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వర్సిటీ వ్యవస్థాపకులు డా.నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌ సోమవారం తెలిపారు.

Published : 28 Mar 2023 04:24 IST

ప్రస్తుత, పూర్వ విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వర్సిటీ వ్యవస్థాపకులు డా.నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌ సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వర్సిటీ ప్రస్తుత, పూర్వ విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు శాఖ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌, కవితారచన; సంగీత శాఖ వారికి గాత్ర, వాద్య సంగీతం, లలితగీతాలు, సినిమా పాటలు; రంగస్థల కళల శాఖ వారికి ఏకపాత్రాభినయం, ధ్వన్యనుకరణ, పద్యపఠనం, షార్ట్‌ ఫిలిమ్‌ మేకింగ్‌, ముఖాభినయం; ‘శిల్పం-చిత్రలేఖన శాఖ’ ద్వారా పెయింటింగ్‌ (పండగలు, సంస్కృతి), పోస్టర్‌, లోగో మేకింగ్‌, రంగవల్లులు; నృత్యశాఖ వారికి కూచిపూడి, ఆంధ్రనాట్యం; జానపద కళల శాఖ వారికి జానపద వాద్యం (డప్పు), ఇంద్రజాలం, జానపద గేయాలు, జానపద నృత్యం (సోలో), ఏకపాత్రాభినయం(రంగస్థల కళల శాఖ ద్వారా), జానపద వస్తు ప్రదర్శన; యోగ శాఖ వారికి యోగాసనాలు, జర్నలిజం శాఖ వారికి ఎన్టీఆర్‌ చలనచిత్రాలు-సామాజిక స్పృహ-చర్చాగోష్ఠి; జ్యోతిషశాఖ వారికి జ్యోతిషం-శాస్త్రీయాంశాలపై చర్చాగోష్ఠి, భాషాశాస్త్రశాఖ విద్యార్థులకు తెలుగు భాష ఔన్నత్యం-చర్చాగోష్ఠి అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను ఏప్రిల్‌ 15లోగా ఆయా శాఖల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని