రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు

పాస్‌పోర్టుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం ప్రకటించింది.

Updated : 03 Jun 2023 04:33 IST

ప్రయోగాత్మకంగా రోజూ 40 అపాయింట్‌మెంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: పాస్‌పోర్టుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం ప్రకటించింది. ఇతర పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు ఇక్కడా సాధారణ అపాయింట్‌మెంట్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో ప్రీపోన్‌మెంట్‌ అభ్యర్థనలు మాత్రమే పరిశీలించేవారని, పన్నెండేళ్ల తర్వాత మరోసారి పాస్‌పోర్టుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ప్రయోగాత్మకంగా రోజూ 40 సాధారణ అపాయింట్‌మెంట్లు మంజూరు చేస్తామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు