పాఠశాలలకు సెలవులు ముందే ప్రకటించాల్సింది.. విద్యాశాఖ మంత్రికి వరంగల్‌వాసి ఫోన్‌

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాఠశాలలకు ప్రభుత్వం రెండురోజులు సెలవులు ప్రకటించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated : 21 Jul 2023 09:58 IST

లేబర్‌కాలనీ(వరంగల్‌), న్యూస్‌టుడే: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాఠశాలలకు ప్రభుత్వం రెండురోజులు సెలవులు ప్రకటించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాఠశాలలకు రెండురోజులు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం ప్రకటన చేయడంపై వరంగల్‌కు చెందిన ఎల్‌.శ్రీనివాస్‌ నేరుగా మంత్రికి ఫోన్‌ చేశారు. ‘మేడమ్‌.. వర్షాలపై వాతావరణశాఖ ముందే హెచ్చరించింది కదా. మీరు గురువారం ఉదయం పిల్లలు పాఠశాలలకు వెళ్లాక సెలవు ప్రకటించడం వల్ల ఫలితమేంటి’ అని అడిగారు. మంత్రి స్పందిస్తూ.. రోజులా తుంపర్లు పడతాయనుకున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని చెబితే నేను ప్రకటన చేశా’ అంటూ సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని