తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మంది ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తుంది.

Updated : 19 Aug 2023 05:40 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మంది ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తుంది. ఈ మేరకు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం 2021కి  తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేసింది. గింజల నరసింహారెడ్డి(కవిత), తేరాల సత్యనారాయణశర్మ(పరిశోధన), బి.నరహరి(చిత్రలేఖనం), డా.ఈమని శివనాగిరెడ్డి(శిల్పం), మేలట్టూర్‌ ఎస్‌.కుమార్‌(నృత్యం), పి.పూర్ణచందర్‌(సంగీతం), జి.వల్లీశ్వర్‌(పత్రికా రంగం), దెంచనాల శ్రీనివాస్‌(నాటక రంగం), వెడ్మ శంకర్‌(జానపద కళారంగం), డా.ముదిగొండ అమరనాథశర్మ(అవధానం), డా.కొంపల్లి నీహారిణి(ఉత్తమ రచయిత్రి), డా.జి.అమృతలత(నవల/కథ)కు పురస్కారాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లోని వర్సిటీ(పబ్లిక్‌ గార్డెన్స్‌) ప్రాంగణంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఒక్కొక్కరిని రూ.20,116 నగదుతో సత్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు