TS Elections: ఓట్ల బడి అయిదేళ్లకోసారి తెరుచుకుంటుంది

నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని అడవిబొల్లారంలో ప్రాథమిక పాఠశాల రెండున్నర దశాబ్దాల కిందట మూతపడింది.

Updated : 02 Nov 2023 07:36 IST

నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని అడవిబొల్లారంలో ప్రాథమిక పాఠశాల రెండున్నర దశాబ్దాల కిందట మూతపడింది. దానికి ప్రతి అయిదేళ్లకోసారి మరమ్మతులు చేసి, ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. అదేరోజు రాత్రికి మళ్లీ మూసేస్తారు. ఇలా ఎందుకంటారా..? ఇక్కడ పోలింగ్‌ నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. నకిరేకల్‌ నియోజకవర్గంలోని 216వ నంబరు పోలింగ్‌ కేంద్రం పరిధిలో అడవిబొల్లారం, భూపతికుంట గ్రామాలకు చెందిన 214 మంది ఓటర్లు ఉన్నారు. అడవిబొల్లారంలో పాఠశాల మూతపడినప్పటికీ 1999 నుంచి ప్రతి ఎన్నికలకు మరమ్మతులు చేసి తెరుస్తున్నారు. ఫర్నీచర్‌ సమకూరుస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మాత్రం గ్రామ పంచాయతీ కేంద్రమైన గొల్లగూడెంలో పోలింగ్‌ నిర్వహిస్తారు.

న్యూస్‌టుడే, నకిరేకల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు