నాకూ, అమ్మాయికీ ఇదే సమస్య
వయసు 38. మూడేళ్లుగా జుట్టు బాగా ఊడుతోంది. థైరాయిడ్, చుండ్రు సమస్యల్లేవు. 14 ఏళ్ల మా అమ్మాయికీ ఇదే సమస్య. ఎందుకిలా? ఏమైనా చికిత్సలు, పరీక్షలు చేయించుకోవాలా?
వయసు 38. మూడేళ్లుగా జుట్టు బాగా ఊడుతోంది. థైరాయిడ్, చుండ్రు సమస్యల్లేవు. 14 ఏళ్ల మా అమ్మాయికీ ఇదే సమస్య. ఎందుకిలా? ఏమైనా చికిత్సలు, పరీక్షలు చేయించుకోవాలా?
- ఓ సోదరి
సాధారణంగా జుట్టు పెరుగుదల మూడు దశల్లో ఉంటుంది. ఎనాజిన్.. పెరిగే దశ. 2-8 ఏళ్లు ఉంటుంది. 85% పెరుగుదల ఈ దశలోనే. జుట్టు ఊడటమనేది అసలుండదు. కెటాజిన్ 2-3 వారాలుంటుంది. దీనిలో పెరుగుదల, ఊడటం ఉండవు. ట్రెలోజిన్ దశ 2-4 నెలలు ఉంటుంది. జుట్టు బాగా రాలిపోతుంది. చాలామంది ఆరోగ్య సమస్య అని కంగారు పడిపోతుంటారు కానీ.. సాధారణమే. ఇదంతా ఓ సైకిల్. కాబట్టి, రోజుకు 50-100 ఊడినంత మాత్రాన భయపడొద్దు. నెలలు, ఏళ్లు కొనసాగుతుంటేనే సమస్య ఉన్నట్లు. జింక్, ఐరన్, విటమిన్లు డి, ఇ వంటివి లోపించడం, హార్మోన్ల అసమతుల్యత... ఇలా ఏదైనా కారణమవొచ్చు. మెనోపాజ్ దగ్గరవుతోంది, డైటింగ్ చేస్తున్నారా చూసుకోండి. వీటివల్లా జుట్టుపై ప్రభావం పడుతుంది.
ఇక పిల్లలు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడం, గట్టిగా లాగిపట్టి జుట్టు అల్లడం, బ్లోయర్లు, స్ట్రెయిటనింగ్ వంటివి చేస్తుంటారు కదా! ఇవీ వెంట్రుకలు రాలడానికి కారణమవుతాయి. సరిగా తినకపోవడం, మానసిక ఒత్తిడీ, ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలు.. వంటివీ ప్రభావం చూపేవే. ముందు ఐరన్, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, బీన్స్ వంటి వాటికి ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వండి. రసాయన ఉత్పత్తులు స్టైలింగ్ వాటికి దూరంగా ఉండండి. తక్కువ గాఢత గల షాంపూలనే వాడాలి. కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. డీహెచ్‌ఈఏ టెస్టోస్టీరాన్, ప్రొలాక్టిన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్, సంపూర్ణ రక్త పరీక్ష చేయించండి. ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. వాటి ఆధారంగా మందుల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇవి వాడాకా సమస్య తగ్గకపోతే అప్పుడు ప్రొటీన్ రిచ్ ప్లాస్మా థెరపీ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.