ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఆరు నెలల బాబు. నా భర్త ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి. చాలా కోపిష్టి, మొండివాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. నేను సంప్రదాయ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. ఇన్నేళ్లూ అతన్ని భరించాను. అతని నుంచి విడాకులు తీసుకుంటే కుటుంబం పరువు పోతుందేమో అని ఆలోచిస్తున్నా.
నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఆరు నెలల బాబు. నా భర్త ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి. చాలా కోపిష్టి, మొండివాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. నేను సంప్రదాయ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. ఇన్నేళ్లూ అతన్ని భరించాను. అతని నుంచి విడాకులు తీసుకుంటే కుటుంబం పరువు పోతుందేమో అని ఆలోచిస్తున్నా. చిన్న చిన్న విషయాలకూ నాపై కోపం చూపించి, బాబుని తన కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కెరియర్, డబ్బు, హోదా అన్ని విధాలుగా తనకంటే మెరుగ్గానే ఉన్నా. ఈ బంధంలో ఉండాలో లేదో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి
మీ భర్త పెళ్లయిన మొదటి నుంచీ ఇదే ప్రవర్తనతో ఉన్నారా లేక ఈమధ్య కాలంలోనే ఇలా మొండిగా మారారా అనేది తెలియడం లేదు. పిల్లవాడిపై ప్రేమను చూపించడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయంటే... ముందు మీ రెండు కుటుంబాలతో మాట్లాడి అటువంటివి జరగకుండా చూసుకోవాలి. ఏది ఎలా ఉన్నా లీగల్‌గా బాబు పెద్దయ్యే వరకూ తల్లి సంరక్షణలోనే ఉండాలి. మీరు దాని గురించి ఆలోచించి బాధపడనవసరం లేదు. అతనితో మాట్లాడి ప్రవర్తనలో మార్పు తేవొచ్చేమో ప్రయత్నించండి. ఈ మధ్యకాలంలోనే అతని ప్రవర్తనలో మార్పు వచ్చి ఉంటే ఓసారి సైకాలజిస్ట్‌ను కలవండి. మానసిక వ్యాధులు ఏమైనా ఉంటే మందుల ద్వారా అతనిలో మార్పు తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తారు. లేదా అతని వ్యక్తిత్వమే అలా ఉంటే మీ ఇద్దరికీ మ్యారిటల్ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండేలా, మీపట్ల వ్యవహారశైలి ఎలా ఉండాలన్నది తనకి తెలియజేస్తారు. మీకూ అతని ప్రవర్తనపై అపోహలూ, భయాలు ఏమైనా ఉంటే పోగొడతారు. మీరు అన్ని విషయాల్లో అతని కంటే బాగానే ఉన్నారు కాబట్టి, పిల్లవాడిని పెంచడానికి ఇబ్బంది లేదు. ఇటువంటి పరిస్థితులకు అధైర్యపడకుండా ఉండండి. ఓసారి పెద్దవాళ్లతోనూ మీ సమస్యను చర్చించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ గింజలతో అందంగా మెరిసిపోదాం!
- పాపిడి బిళ్ల... హెయిర్ బ్యాండ్‌లా..!
- ఎండవేళ చర్మం జాగ్రత్త!
- ఆ ప్రేమకో కానుక..!
- జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
ఆరోగ్యమస్తు
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- గుండె పదిలంగా ఉండాలా...
- బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
- మూత్ర సమస్యలకు శలభాసనం
- వేసవి తాపానికి కుంకుమపువ్వు తేజస్సు..!
అనుబంధం
- ఓ చిన్న అబద్ధంతో...
- టీనేజీ జీవితం... ‘టర్నింగ్ రెడ్’
- ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..!
- సరదాలు... మాటలు... చాలు!
- ‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
యూత్ కార్నర్
- పసిప్రాణాలకు ‘రక్ష’ణగా..!
- మొదటి ర్యాంకుతో... రిత్విక
- అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
- అమ్మతో.. నా అనుబంధం!
- అదిగో... ఆ రింగుల జుట్టమ్మాయే!
'స్వీట్' హోం
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
- చల్లచల్లని పుచ్చకాయ్... తినేదికాదు సుమీ!
- Mothers Day: అక్కడ ఈ రోజున అమ్మలకు సెలవు!
- ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
- Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?
వర్క్ & లైఫ్
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’..!
- పోటీలో నెగ్గాలంటే...
- అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?
- ప్రేమించుకుంటున్నారా?
- ఆ కూతురు తల్లికిచ్చిన కానుకే ‘మదర్స్ డే’!