మూత్ర సమస్యలకు శలభాసనం

శలభ అంటే మిడత. ఈ ఆసనం మిడత, గొల్లభామను పోలి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి ట్యాక్సిన్లను బయటకు పంపించే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎండవేడికి ఎంత నీరు తాగినా ఒంట్లోని నీరంతా ఆవిరైపోవడంతో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా వృథాగానే పోతున్నాయి.

Published : 11 May 2024 02:26 IST

శలభ అంటే మిడత. ఈ ఆసనం మిడత, గొల్లభామను పోలి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి ట్యాక్సిన్లను బయటకు పంపించే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎండవేడికి ఎంత నీరు తాగినా ఒంట్లోని నీరంతా ఆవిరైపోవడంతో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా వృథాగానే పోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వేసవిలో మూత్రసమస్యల బారినపడుతుంటారు. దీనినుంచి బయటపడేందుకు ఒకసారి ‘శలభాసనం’ ప్రయత్నించి చూడండి.

ముందుగా బోర్లా పడుకోవాలి. రెండు చేతులను ఫొటోలో చూపిన మాదిరిగా తొడల కిందకి వచ్చేలా నేలమీద ఆనించాలి. శ్వాస వదులుతూ గడ్డం నేలకు తాకేలా చూసుకోవాలి. రెండుకాళ్లూ పైకి పెట్టి ఇరవై సెకన్లపాటు గాల్లో ఉంచాలి. ఈ భంగిమలో శరీర బరువు మొత్తం పొత్తికడుపు, బొడ్డు భాగాల్లో పడేలా చూసుకోవాలి. రోజుకి ఇలా మూడుసార్లు చేయాలి. దీంతోపాటు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ.. వ్యాయామం, తగినంత నిద్రఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్‌ ఎక్కువ ఉండే.. బాదం, పప్పు ధాన్యాలు, పీచుపదార్థం, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌ ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. డెలివరీ అనంతరం సాగిన పొట్ట తగ్గుతుంది. నెలసరి, గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు నియంత్రణలోకి వస్తాయి. జీవక్రియ మెరుగుపడుతుంది.

శిరీష, యోగ గురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్