ఈ జుగుప్స ఎందుకు?

నా వయసు 28. ఉద్యోగం చేస్తున్నా. ఎందుకో తెలియదు కానీ... చిన్నప్పటి నుంచీ కొన్ని వస్తువులను తాకాలన్నా, కొన్ని విషయాలు విన్నా జుగుప్స కలుగుతుంటుంది. వాటి గురించి తల్లిదండ్రులతో చర్చించాలన్నా ఇబ్బందిగా ఫీలవుతా.

Published : 06 May 2024 14:10 IST

నా వయసు 28. ఉద్యోగం చేస్తున్నా. ఎందుకో తెలియదు కానీ... చిన్నప్పటి నుంచీ కొన్ని వస్తువులను తాకాలన్నా, కొన్ని విషయాలు విన్నా జుగుప్స కలుగుతుంటుంది. వాటి గురించి తల్లిదండ్రులతో చర్చించాలన్నా ఇబ్బందిగా ఫీలవుతా. ఇదే పద్ధతిలో ఉంటే పెళ్లయితే... ఇబ్బంది పడతావు అంటోంది నా స్నేహితురాలు. నిజంగానే ఇది మానసిక సమస్యా తెలపగలరు?

ఓ సోదరి

కొందరు కొన్ని విషయాలు వినాలన్నా, కొన్ని రకాల వస్తువులను తాకాలన్నా ఇష్టపడరు. ఇంకొందరికి మెత్తటి వస్తువులన్నా, బల్లులన్నా జుగ్సుప. వీటినే ‘సెన్సరీ ఇష్యూస్‌’ అంటారు. చిన్నతనంలో వాటివల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై, అవి మనసులో నాటుకుపోవడమే ఈ ఏవగింపు కారణం. మీకూ అలానే జరిగి ఉండొచ్చు. అలానే, కొందరు తల్లిదండ్రులు... పిల్లలు దేని గురించైనా ప్రశ్నించినా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా... అది చిన్నవాళ్ల  విషయం కాదంటూ వారి మాటల్ని కొట్టిపారేస్తుంటారు. దీంతో అలా అడగడం తప్పు అన్న భావన వారిలో జీర్ణించుకుపోయి, పెద్దయ్యాక కూడా ఆ భయం, ఏహ్యభావం కొనసాగుతాయి.  నిజానికి ఇవన్నీ పెద్ద మానసిక సమస్యలేం కాదు. చాలామందికి ఇలాంటి ఫోబియాలు ఏవో ఒకటి ఉంటుంటాయి. మీరు ఉద్యోగం చేస్తున్నానన్నారు.  మీ దైనందిన జీవితానికి అడ్డుపడి బాధిస్తుంటే, మీరు కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు. పెళ్లికి ముందూ నిపుణుల్ని కలవొచ్చు. వాళ్లు ‘ఇన్‌సైట్‌ ఓరియెంటెడ్‌ థెరపీ’ ద్వారా ఇలాంటి మెంటల్‌ బ్లాక్స్‌ ఉన్నాయేమో విశ్లేషించి చికిత్స చేస్తారు. లేకపోతే వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్