థైరాయిడ్‌తో బరువు పెరిగా...

థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లలో అవసరమైన మేరకు థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి జరగనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యను గుర్తించే లోపే బరువు పెరుగుతారు. మందులు వాడటం మొదలు పెట్టాక బరువు పెరగడం తగ్గుతుంది. మీ ఎత్తుకు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉంటే తప్పక తగ్గాలి. ఇందుకు ఆహార నియమాలు పాటించడంతోపాటు శారీరక శ్రమనూ దినచర్యలో భాగం చేసుకోవాలి.

Published : 26 Apr 2024 15:16 IST

నా వయసు 36 థైరాయిడ్‌ ఉంది. బరువు పెరిగిపోయా. అలాగని తిండి మానేస్తే నీరసం. ట్యాబ్లెట్స్‌ వేసుకుంటున్నా... ఆహార నియమాలు పాటించి బరువు నియంత్రించుకోవచ్చు అంటున్నారు. అదెలా?

ఓ సోదరి

థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లలో అవసరమైన మేరకు థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి జరగనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యను గుర్తించే లోపే బరువు పెరుగుతారు. మందులు వాడటం మొదలు పెట్టాక బరువు పెరగడం తగ్గుతుంది. మీ ఎత్తుకు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉంటే తప్పక తగ్గాలి. ఇందుకు ఆహార నియమాలు పాటించడంతోపాటు శారీరక శ్రమనూ దినచర్యలో భాగం చేసుకోవాలి. కెలోరీలు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు అంటే... వేపుళ్లు, గ్రేవీ కూరలు, స్వీట్లు వంటివి తినడం తగ్గించాలి. రోజువారీ ఆహారంలో 4 నుంచి 5 చెంచాల నూనెను మాత్రమే వాడాలి. నువ్వులు, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌ గింజలు, గసగసాలు వంటివి మోతాదుకు మించి తీసుకోకూడదు. పెసరట్టు, లావు గోధుమరవ్వ ఉప్మాలను అల్పాహారంగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో విటమిన్లు, ప్రొటీన్లు ఉండే వాటిని తినాలి. తక్కువ నూనెతో వండిన కాయగూరలు, ఆకు కూరలతో భోజనం చేయాలి. చిరుతిండిగా రాగిజావ, స్వీట్‌కార్న్‌, పాప్‌కార్న్‌, పండ్లు వంటివి తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే పప్పుపొంగలి, మల్టీగ్రెయిన్‌ పిండితో చేసిన పుల్కాను ఎక్కువ కూరతో తినాలి. ఉడికించిన కోడిగుడ్డు తీసుకోవాలి. మీ ఆహారంలో అయొడైజ్డ్‌ సాల్ట్‌ను మాత్రమే వాడాలి. వెన్న తక్కువ ఉండే పాలను తాగాలి. వీటితో పాటూ వ్యాయామాలూ చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు ఒకేసారి కాకుండా నెమ్మదిగా తగ్గేలా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్