అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. పెళ్లప్పుడు ఆయన ఎంబీఏ చేసి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తరవాత ఎప్పుడూ నష్టాలనీ, కొత్త బిజినెస్ మొదలుపెడతాననీ డబ్బులు అడిగేవారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. పెళ్లప్పుడు ఆయన ఎంబీఏ చేసి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తరవాత ఎప్పుడూ నష్టాలనీ, కొత్త బిజినెస్ మొదలుపెడతాననీ డబ్బులు అడిగేవారు. దాంతో నేను దాచుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు బంధువుల దగ్గరా, రకరకాల లోన్లు పెట్ట్టి రుణాలు తీసుకున్నా. ఏళ్లు గడుస్తున్నా... అదే పరిస్థితి. ఈఎమ్ఐల భారం మోయలేకపోతున్నా. తాజాగా మరోసారి రుణం తీసుకోమని ఒత్తిడి తేవడంతో ఇక, విడాకులకు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నా. కోర్టు దీన్ని కారణంగా పరిగణిస్తుందా?
ఓ సోదరి
పదేళ్లుగా మీరెంత సాయం చేస్తున్నా... మీ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదంటున్నారు. ఆ కారణంగా మిమ్మల్ని అప్పులు తీసుకురమ్మని బలవంతం చేయడం క్రూరత్వం కిందకే వస్తుంది. అయితే, దాన్ని నిరూపించడం కష్టం. హిందూ వివాహ చట్టం(సెక్షన్-13) కింద అక్రమ సంబంధం పెట్టుకోవడం, శారీరకంగా, మానసికంగా హింసించడం, రెండేళ్లు భాగస్వామికి దూరంగా ఉండటం, మతం మారడం, మానసిక స్థితి సరిగా లేక వెళ్లిపోవడం...వంటి వాటిని కారణాలుగా చూపించి విడాకులు తీసుకోవచ్చని చెబుతోంది. అయితే, ఇందులో సరైన నిర్వచనం ఇవ్వకపోయినా... మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించడం క్రూరత్వమే అంటూ పలు కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇక, మీ విషయానికి వస్తే పెళ్లికి ముందు భర్త, అత్తింటి వారి గురించి లోతుగా తెలుసుకోలేకపోవడమే మీ సమస్యకు ప్రధాన కారణం. భర్తను నమ్మి మీరు అప్పులు తెచ్చివ్వడం, తిరిగి వాటిని ఆయన తీర్చలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇదంతా ఆర్థిక హింసే. అయితే, ఇప్పటివరకూ తీసుకున్న అప్పులను తీర్చాల్సిన బాధ్యత అతనిదే. మీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అతడి వేధింపుల్ని మీరు నిరూపించగలగాలి. అంటే... మీరు మీవారి కోసం తీసుకున్న లోన్లు, ఆ డబ్బుని అతడి వ్యాపారంలో పెట్టినట్లుగా ఆధారాలు చూపించాలి. లేదంటే అతడు మీరు లోన్ ఎందుకు తీసుకున్నారో తెలియదని బుకాయించే అవకాశం ఉంది. అతడి దగ్గర్నుంచి మీకు ఏమీ రాకపోయినా తండ్రిగా తన కొడుక్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలానే, మీ దగ్గర నుంచి తీసుకున్న రుణాలు, పెళ్లప్పుడు ఇచ్చిన కట్న కానుకలు... అన్నింటికీ కలిపి సెక్షన్ 25 కింద శాశ్వత భత్యం అడగండి. డివోర్స్ కేసుతో పాటు కోర్టు దాన్నీ నిర్ణయిస్తుంది. ఆలోచించి అడుగు వేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ‘పెరుగు’తో మెరిసే జుట్టు!
- చర్మంపై ముడతలు.. ఈ పొరపాట్లు చేస్తున్నారేమో?!
- నలుపు పోయేదెలా..!
- బ్యాగుకో... ముస్తాబు!
- ఈ వేసవి సమస్యలకు.. వంటింటి చిట్కాలు!
ఆరోగ్యమస్తు
- పోషకాల అవిసెలు..!
- పెళ్లికి ముందే స్టెంట్ వేశారు.. పిల్లలు పుడతారా?
- శరీరాన్ని చల్లబరిచే చంద్రభేదన..!
- బీపీని అదుపు చేసే ఆహారం!
- శాకాహారుల ప్రొటీన్లు ఇవి!
అనుబంధం
- సుతిమెత్తగా... చిన్నారులకు హాయిగా..!
- పంచతంత్రం... ఆఫీసు పాఠం!
- అతి ప్రేమ ఉంటే.. అలుసైపోతుంది జాగ్రత్త!
- నా ప్రేమని... చెప్పనా?
- బ్రేకప్ అయినా.. ఆగిపోవద్దు!
యూత్ కార్నర్
- ఆ బడిలో... రహస్యంగా చదువుకున్నా!
- నాట్య‘మయూరి’ కావాలని!
- సామాన్యులకూ సీపీఆర్ తెలియాలి!
- ఈ ముగ్గురమ్మాయిలు.. ‘స్టాన్‌ఫర్డ్’ స్కాలర్స్’!
- Celebrity Fashion: అందాన్ని పెంచే ‘అజ్రఖ్’ ప్రింట్!
'స్వీట్' హోం
- చేతులు మండుతున్నాయా..!
- కాఫీ లవర్స్ కోసం...
- మీ నగల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
- ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వస్తుందా?
- ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!
వర్క్ & లైఫ్
- Cannes: బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతూ.. బాడీ పాజిటివిటీని చాటిన ఐశ్వర్య!
- Share Your Story: మీ కథ చెబుతారా?
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- కొంచెం బద్ధకించండి..!
- ‘థాంక్యూ గాడ్’