Lottery: పిల్లల పుట్టిన తేదీతో కొంటే.. రూ.33 కోట్ల లాటరీ

తన పిల్లలు పుట్టిన తేదీలతో లాటరీ టికెట్లు కొన్న ఓ భారతీయ వ్యక్తి(Indian Man).. కోట్లాది రూపాయల సొమ్మును సొంతం చేసుకున్నారు. 

Published : 10 Feb 2024 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాటరీ రూపంలో ఓ భారతీయుడి(Indian Man)కి జాక్‌పాట్ తగిలింది. ఉచితంగా లభించిన టికెట్‌ రూపంలో రూ.33 కోట్ల భారీ అదృష్టం వరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కేరళ(Kerala)కు చెందిన రాజీవ్‌ అరిక్కట్.. కొన్నేళ్లుగా యూఏఈ(UAE)లో ఉద్యోగం చేస్తున్నారు.  ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్‌ గత మూడేళ్లుగా బిగ్‌ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. ‘‘బిగ్‌ టికెట్‌పై ఈసారి స్పెషల్ ఆఫర్ వచ్చింది. నేను రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాను. నాకు లాటరీ తగులుతుందని ప్రతిసారీ నమ్మకంతో ఉంటాను. ఈసారి ఆరు టికెట్లు ఉండేసరికి ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. నా భార్య, నేను కలిసి 7, 13 నంబర్‌తో ఉన్న టికెట్లు కొన్నాం. అవి నా పిల్లల పుట్టినరోజు తేదీలు’’ అని వెల్లడించారు.

‘అన్నా ఇది వన్డే కాదే.. టెస్ట్ మ్యాచ్‌లా ఉంది’.. పాక్‌ ఎన్నికలపై జోక్స్‌!

‘‘మూడేళ్లలో మొదటిసారి నాకు అదృష్టం కలిసివచ్చింది. ఉచితంగా వచ్చిన టికెట్‌తో మాకు విజయం లభించింది. లాటరీ గెల్చుకున్నానంటూ నా పేరు ప్రకటించగానే  పట్టరాని సంతోషం కలిగింది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాతోపాటు మా వాళ్లందరికీ జీవితాలను మార్చిన క్షణమది’’ అంటూ రాజీవ్‌ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. తాను గెల్చుకున్న  15 మిలియన్ల దిర్హమ్‌లు(సుమారు రూ.33 కోట్లు) ఎలా ఖర్చు పెట్టాలన్న దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, తన ఉదార హృదయాన్ని మాత్రం చాటుకున్నారు. ఆ డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి, ట్విస్ట్ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని