South Africa: దక్షిణాఫ్రికా గనిలో కూలిన ఎలివేటర్‌.. 11 మంది మృతి, 75 మందికి గాయాలు

దక్షిణాఫ్రికాలో ప్లాటినం ఉత్పత్తి చేసే ఓ గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 

Published : 28 Nov 2023 18:43 IST

జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా (South Africa)లోని ఓ గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 75 మంది గాయపడ్డారు. రస్టెన్‌బర్గ్‌లోని ఇంప్లాట్స్‌ అనే సంస్థకు చెందిన ప్లాటినం ఉత్పత్తి చేసే గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఇంప్లాట్స్ ప్రతినిధి తెలిపారు. వివరాల్లోకి వెళితే..

సోమవారం సాయంత్రం విధులు ముగిసిన అనంతరం 86 మంది కార్మికులు గని లోపలి నుంచి ఎలివేటర్‌ ద్వారా పైకి వస్తున్నారు. వారిని పైకి తీసుకొస్తున్న ఎలివేటర్ 656 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలివేటర్‌లో ఉన్నవారిలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చినట్లు ఇంప్లాట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలివేటర్‌ కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. 

పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు

ప్రపంచంలో ప్లాటినం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది దేశంలో జరిగిన మైనింగ్ ప్రమాదాల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఏడాది 74 మంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేపట్టిన జాగ్రత్త చర్యల కారణంగా మైనింగ్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వాధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు