పాక్‌లో సైన్యమే అత్యంత నమ్మకమైన సంస్థ

సార్వత్రిక ఎన్నికల ముంగిట పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత నమ్మకమైన సంస్థగా ‘పాకిస్థాన్‌ సైన్యం’ అవతరించింది.

Published : 03 Feb 2024 06:02 IST

 తాజా సర్వేలో వెల్లడి

ఇస్లామాబాద్‌: సార్వత్రిక ఎన్నికల ముంగిట పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత నమ్మకమైన సంస్థగా ‘పాకిస్థాన్‌ సైన్యం’ అవతరించింది. ఈ మేరకు ఇప్సోస్‌ పాకిస్థాన్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైన్యానికి 74 శాతం ఆమోదం లభించింది. సర్వేలో ప్రస్తావించిన ఎనిమిదింటిలో ఆశ్చర్యకరంగా ఎన్నికల సంఘం అట్టడుగున నిలిచింది. సర్వేలో భాగంగా 18-34 ఏళ్ల మధ్య వయసున్న 2,050 మందిని ప్రశ్నించినట్లు ద న్యూస్‌ ఇంటర్నేషనల్‌ దినపత్రిక తెలిపింది. 58 శాతం ఆమోదంతో పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు రెండో స్థానంలో నిలిచిందని, ఆ తర్వాత స్థానాన్ని మీడియా దక్కించుకుందని వెల్లడించింది. ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారా? అన్న ప్రశ్నకు 70 శాతం మంది అవునని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని