Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు వరుస ఎదురుదెబ్బలు.. తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)కు మరో కేసులో జైలు శిక్ష పడింది. 

Updated : 31 Jan 2024 12:38 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తోషఖానా కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. కొద్ది గంటల ముందే అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఆయనకు పదేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే.

ఇమ్రాన్‌ (Imran Khan) ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. పాక్‌ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్‌ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు!

వచ్చే నెల 8న పాకిస్థాన్‌(Pakistan) ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆయనకు వరుసగా శిక్షలు పడుతున్నాయి. ఇప్పటివరకు ఆయనపై 150 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని