Israel: గాజాపై యుద్ధం మరిన్ని నెలలపాటు కొనసాగొచ్చు: ఐడీఎఫ్‌ చీఫ్‌

గాజాపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశముందని ఇజ్రాయెల్‌ సైన్యం చీఫ్‌ హర్జీ హెలెవీ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే సమయం ఎక్కువే పడుతుందని ఆయన అన్నారు. 

Published : 27 Dec 2023 01:52 IST

జెరూసలెం: హమాస్‌ (Hamas) అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం (Idf) గాజా (gaza) పై దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అక్కడి అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేయడానికి వీలుగా యుద్ధానికి విరామం ఇవ్వాలని ఐరాస, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నా.. ఇజ్రాయెల్‌ దాడుల్ని ఆపట్లేదు. పైగా.. ఈ యుద్ధం మరిన్ని నెలలపాటు కొనసాగొచ్చని ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్‌ హర్జీ హెలెవీ తాజాగా స్పష్టం చేశారు. ఈ మేరకు గాజా సరిహద్దుల్లో హర్జీ మీడియాతో మాట్లాడారు.

‘‘ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి మాయాజాలపు పరిష్కారాలు, అడ్డదారులు ఉండవు. దానికి దృఢ సంకల్పం, నిరంతర పోరాటం అవసరమవుతాయి. మేం అలాగే పోరాడుతున్నాం. ఎలాగైనా హమాస్‌ నాయకత్వాన్ని చేరుకొని సమూలంగా అంతమొందిస్తాం. ఈ క్రమంలో మా యుద్ధం మరిన్ని నెలలపాటు కొనసాగొచ్చు. ఈ విషయాన్ని ముందే చెప్పాం. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే, మేం విభిన్న పద్ధతులను అవలంబించబోతున్నాం. ఇజ్రాయెల్‌కు శత్రువులు ఉండకూడదు. అదే మా లక్ష్యం’’అని హర్జీ మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని