Joe Biden: నిక్కీ హేలీపై ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు.. జో బైడెన్‌ మండిపాటు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీపై చేసిన విమర్శలకు అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. 

Updated : 12 Feb 2024 11:22 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ (Nikky Haley) భర్తను ఉద్దేశిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)మండిపడ్డారు. దేశానికి సేవలందిస్తున్న సైనికుడి పట్ల ట్రంప్‌ వైఖరిని తప్పుబట్టారు.

నిక్కీ భర్త మైఖేల్‌ హేలీ ఒక సైనికుడు. గతేడాది జూన్‌ నుంచి ‘హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ ప్రాంతంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియని ట్రంప్‌ తన ప్రత్యర్థి నిక్కీని కవ్వించేందుకు మైఖేల్‌పై నోరుపారేసుకున్నారు. ‘‘ఆమె భర్త (నిక్కీని ఉద్దేశిస్తూ) ఎక్కడ? ఆయన దూరంగా ఉన్నారు. ఇంతకీ అతడికి ఏమైంది?’’ అంటూ ప్రశ్నించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై బైడన్‌ మండిపడ్డారు.

నీ భర్త ఎక్కడ?.. నిక్కీ హేలీపై ట్రంప్‌ పరిహాసం

‘‘ట్రంప్‌ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే.. మేజర్‌ హేలీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన దేశానికి సేవ చేస్తున్నారు. మన సైనికులను ట్రంప్‌ మోసగాళ్లలా చూస్తారన్న విషయం తెలిసిందే. కానీ, ఏదైనా ఆయనకు ఇబ్బందిగా అనిపిస్తే.. అప్పుడు దేశసేవ కనిపించదు’’ అని అర్థం వచ్చేట్లు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు నిక్కీ కూడా ఘాటుగా బదులిచ్చారు. తన భర్త సేవలు గర్వకారణమంటూ.. ట్రంప్‌ మానసిక సామర్థ్యంపై విమర్శలు గుప్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని