Bangladesh: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌కు జైలుశిక్ష

బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు జైలు శిక్ష పడింది. 

Updated : 02 Jan 2024 12:22 IST

ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh) కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌(Muhammad Yunus) దోషిగా తేలారు. ‘యూనస్‌తో పాటు ఆయనకు చెందిన గ్రామీణ్‌ టెలికాం సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు దోషులుగా తేలారు. వారికి ఆరునెలల సాధారణ జైలుశిక్ష విధించాం’ అని న్యాయస్థానం తెలిపింది.

83 ఏళ్ల యూనస్‌ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్‌ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారనే ఘనత సాధించారు. కానీ, ఇందుకు విరుద్ధంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హసీనా మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

‘చిగురుటాకులా వణికిన జపాన్‌.. వరుసగా 21 భూకంపాలు..!’

పెట్టుబడిదారీ విధానం, సామాజిక బాధ్యత విధానాల కలయికలో పేదల అభ్యున్నతి, మహిళల సాధికారత కోసం యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. పేదలకు స్వయం ఉపాధి నిమిత్తం కొద్ది మొత్తాలను అందించడం దీని ఉద్దేశం. అలాగే పేదరికం, అభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వివిధ సంస్థలను స్థాపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని