Netanyahu: యుద్ధంతోనే బందీల విడుదల సాధ్యం: నెతన్యాహు

గాజాపై సైనిక చర్య విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఇజ్రాయెల్‌ తేల్చి చెప్పింది. బందీల విడుదలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. 

Published : 17 Dec 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌తో యుద్ధ విరమణ గురించి ఇజ్రాయెల్‌  ఏమాత్రం ఆలోచించడంలేదు. సంపూర్ణ విజయం సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తెగేసి చెప్పారు. శనివారం ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బందీలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తీసుకొంటున్న దౌత్య, సైనిక చర్యల తీవ్రతను ఇజ్రాయెల్‌ ఏమాత్రం తగ్గించబోదన్నారు. విజయం సాధించడానికి సైనిక పరమైన ఒత్తిడి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తమ వ్యూహంతో 100 మంది బందీలు సురక్షితంగా వారి వారి నివాసాలకు చేరుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే బందీల విడుదలపై చర్చలకు పిలుపులు వచ్చాయని నెతన్యాహు తెలిపారు. ‘‘ఈ చర్చల్లో సైనిక చర్య ఒత్తిడే కీలక పాత్ర పోషిస్తుంది.. అదే లేకపోతే చర్చలపై మా పట్టు ఉండదు’’అని పేర్కొన్నారు.

200 హమాస్‌ స్థావరాలపై దాడులు..

గాజాలో హమాస్‌కు చెందిన 200 స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) ఆదివారం ప్రకటించింది. ఈ క్రమంలో తమ పారాట్రూప్‌ దళాలు గాజాలోని షిజైయ పట్టణంలో హమాస్‌ వినియోగిస్తున్న పలు అపార్ట్‌మెంట్లపై దాడులు నిర్వహించినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలు, సైనిక పరికరాలను స్వాధీనం చేసుకొన్నారు. 

ఘోర ప్రమాదం.. పడవ మునిగి 60 మందికి పైగా మృతి..!

దక్షిణ గాజాలో హమాస్‌ కీలకమైన ఆయుధ డంప్‌గా వాడుతున్న ఇంటిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నిర్వహించింది. ఇజ్రాయెల్‌కు చెందిన 646 బ్రిగేడ్‌ యూఎన్‌రా సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో ఓ ఆయుధ తయారీ పరికరాలను గుర్తించింది. వీటిని రాకెట్ల తయారీకి వాడుతున్నట్లు గుర్తించారు. ఇదే పాఠశాలలో ఓ సొరంగ ద్వారం కూడా ఉండటం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని